29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్ వాయి, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్ లోకని గంగామణి గంగారం, ఉప సర్పంచ్ మోత్కూరి శ్రీనివాస్ గౌడ్, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీఓ రాజ్ కాంత్ హాజరయ్యారు. గ్రామాలలో అధికారులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగస్వాములై గ్రామాలలో చేపట్టబోయే పనుల కొరకు గ్రామ సర్పంచ్ లకు, ఉపసర్పంచ్ లకు పలు సూచనలు చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్ వాయి సిబ్బంది కార్మికులకు పలు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచ్ లు ఆరేటి రఘు, చింతల కిషన్, జయ దిలీప్, నవీన్ నాయక్, ఉపసర్పంచ్ లు, వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు భరత్, కారోబార్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

Sanitation workers honored as part of Public Administration Progress Plan

More articles

Latest article