24 C
Hyderabad
Sunday, August 2, 2026

డ్రగ్ పార్టీని గుట్టురట్టు చేసిన ఈగల్ టీం 

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కు, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ 

 

 హైదరాబాద్, బతుకమ్మ :

 

మొయినాబాద్ లోని తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై శనివారం రాత్రి ఈగల్ టీం దాడి చేసింది. ఈ దాడిలో 11మంది పార్టీ చేసుకున్నట్టు గుర్తించారు. వారందరికీ స్థానిక పోలీసులు ఈగల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్ టెస్టులను నిర్వహించారు. అందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తో పాటు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తో పాటు మరో నలుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు ఎస్పీ గిరిధర్ తెలిపారు. హిమాచల్ రాష్ట్రంలోని సిమ్లా నుంచి కౌశిక్ రవి అనే వ్యక్తి 2 గ్రాముల కొకైన్స్ తీసుకువచ్చినట్టు విచారణలో తేలింది. ఈ కేసులో 11 మందిని పోలీసులు విచారిస్తున్నారు. అక్కడ గన్ కూడా దొరకడంతో అది లైసెన్స్ కలిగి ఉందా లేదా అని విచారిస్తున్నారు. 2022 అక్టోబర్ 26 న ఇదే ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అప్పట్లో దేశంలోనే సంచలనం రేపింది. ఇప్పుడు అదే ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీని ఈగల్ టీం భగ్నం చేసింది. డ్రగ్స్ కొనుగోలు వినియోగంపై కేసు నమోదు చేపట్టి విచారణ చేస్తున్నారు.

Eagle team busts drug party

More articles

Latest article