24.3 C
Hyderabad

వారం రోజుల్లో 162 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 16,00,000 జరిమానా విధించిన సంబంధిత కోర్టులు

 

. . . పోలీస్ కమిషనర్ సాయిచైతన్య వెల్లడి

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని లా అండ్ ఆర్డర్ , ట్రాఫిక్ పి.ఎస్ లలో గడిచిన వారం రోజుల్లో  162 మంది డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడగా వారిని నిజామాబాద్, బోధన్, అర్మూర్ కోర్టులలో వారిని హాజరుపర్చగా వారిలో ఇద్దరికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి 16,00,000  జరిమానా విధించినట్లు పోలీసు కమిషనర్ సాయిచైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనరేట్ పరిధిలో చేసిన తనిఖీలలో అధిక మొత్తంలో మద్యం తాగి వాహనాలు నడిపి పోలీస్ వారికి పట్టుబడటం జరిగిందన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని  నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాహనాల తనిఖీలు నిర్వహించారన్నారు. ఇందులో భాగముగా ఈ నెల 18 నుండి 23 వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 162 కేసుల నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సీపీ వాహనదారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు మద్యం సేవించి  వాహనాలు నడపరాదని, వాహనాదారులు వాహనానికి సంబంధించినటువంటి  పత్రములు సక్రమముగా తమ వద్ద ఉంచుకోవాలన్నారు. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన వారి లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేయబడునని, మద్యం తాగి వాహనం నడిపి అనుకోని రోడ్ ప్రమాదం జరిగినట్లయితే ఇన్సూరెన్సు లభించదన్నారు. మైనర్లు తాగి వాహనం నడిపి పోలీస్ వారికి దొరికినటైతే మైనర్, వెహికల్ ఓనర్ పైన ఛార్జ్ షీట్ నమోదు చేయబడునని అలాగే జైలు శిక్ష విధించే అవకాశం కలదన్నారు. ఒక సారి కంటే ఎక్కువ సార్లు పట్టుబడినట్లయితే జైలు శిక్ష విధించబడునని, మోటర్ వెహికల్ యాక్ట్  1989 (చట్టం సవరణ – 2019)  అమలులో ఉన్నందున డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొదటిసారి పట్టుబడినట్లయితే 10,000/- జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా తో పాటు జైలు శిక్ష విధించబడునన్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండోసారి పట్టుబడినట్లయితే 15,000 జరిమానా లేదా జైలు శిక్ష లేదా జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడునన్నారు.

More articles

Latest article