26.2 C
Hyderabad
Monday, August 3, 2026

మున్సిపల్ కార్మికులకు జూన్ మొదటి వారంలో రేయిన్ కోట్స్ ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కార్పొరేషన్ కమిషనర్ కు బి ఎల్ టి యు వినతి

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులకు జూన్ మొదటి వారంలో రెయిన్ కోట్స్, షూస్, బ్లౌజ్ లో, యుని పామ్స్, చీపుర్లు, గైపారులు, వాటర్ సప్లై స్ట్రీట్ లైట్స్ డ్రైవర్ తదితర సెక్షన్ కార్మికులకు నాణ్యమైన పరికరాలు ఇవ్వాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. శనివారం బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ ను కలిసి కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు గత రెండు సంవత్సరాలుగా వర్షా కాలంలో రెయిన్ కోట్స్ ఇవ్వడం లేదని ఈ సంవత్సరం జూన్ మొదటి వారంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్ ఔట్ సోర్సింగ్, పర్మినెంట్ కార్మికులకు రైన్ కోట్స్,షూ, బ్లౌజ్ లో,యూని పామ్స్ చీపుర్లు గైపారులు, వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్స్ డ్రైవర్ తదితర సెక్షన్ కార్మికులకు నాణ్యమైన పని ముట్లు అందజేయాలని కోరారు.కాలం చెల్లిన చెత్త సేకరణ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేయడంతో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ స్పందిస్తూ ,రాష్ట్ర ప్రభుత్వ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినందున త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేస్తామని ప్రస్తుతం డీజిల్ వాహనాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలు గా మారుస్తామని  హామీ ఇచ్చారని దండి వెంకట్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బని లత,బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కాంబ్లే మధు జిల్లా ఉపాధ్యక్షులు యాటల అనిల్ కుమార్ పాల్గొన్నారు.

More articles

Latest article