28.2 C
Hyderabad

బడిబాటలో 11 మంది విద్యార్థుల చేరిక

Must read

📰 Generate e-Paper Clip

 పిట్లం, బతుకమ్మ: పిట్లం మండలంలోని గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా  తిమ్మా నగర్ గ్రామంలోని హరిజనవాడ ప్రాంతంలో గల ప్రతి ఇంటిని సందర్శిస్తూ  ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే పిల్లలను  అలాగే ఒకటో తరగతి లో చేరబోయే పిల్లలను , వారి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాల అయినా తిమ్మానగర్ పాఠశాలలో గత సంవత్సరం నుండి నూతన ఉపాధ్యాయుల చేరిక ద్వారా వచ్చిన పాఠశాలలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి  అలాగే ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సదుపాయాల గురించి,  పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి నారాయణ, పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు వివరిస్తూ కరపత్రాలు పంపిణిచేశారు.తల్లిదండ్రులు పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలను  బోధించే విధానాన్ని చూసి తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు మాన్పించి హరిజనవాడ ప్రాంతం నుండి 11 మంది విద్యార్థులను తిమ్మానగర్  పాఠశాలలో చేర్పించుటకు  సుముఖతను చూపుతూ అడ్మిషన్ ఫారాల పైన సంతకం చేశారని ప్రధానోపాధ్యాయులు సి నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు  నారాయణ తో పాటు పాఠశాల సిబ్బంది గిరిజ, రవికుమార్, నవనీత, లక్ష్మి, స్వర్ణలత, జ్యోతి మరియు గ్రామ ప్రముఖులు విద్యాభిమానులు పాల్గొన్నారు.

More articles

Latest article