24.1 C
Hyderabad
Monday, August 3, 2026

యువత మత్తుపదార్థాల మాయలో పడొద్దు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ

 

మత్తు పదార్థాలు బాలలను, యువతను వాటికి బానిసలుగా మారుస్తాయని వాటికి అలవాటు కావద్దని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేధార్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని రవి పబ్లిక్ స్కూల్ లో సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన డ్రగ్స్ వాడకం మూలంగా తలెత్తున్న నష్టాలను వివరించారు. డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలుపాలని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యపైనే దృష్టి కేంద్రీకరించాలని ఆయన కోరారు. సీనియర్ న్యాయవాది మాణిక్ రాజు మాట్లాడుతూ పిల్లలు ఎవరు గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఎలాంటి వస్తువులను స్వీకరించరాదనీ అన్నారు. ఈ మధ్యన చాక్లేట్ లలో మత్తు మందు కలిపి అమ్ముతున్న సంఘనలు జరుగుతున్నాయని జాగత్తగా ఉండాలని సూచించారు. బార్ మాజీ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ డ్రగ్స్ అమ్మడం నేరమని చట్ట ప్రకారం శిక్షర్హమని అన్నారు. హైకోర్టు న్యాయవాది, రవి పబ్లిక్ స్కూల్ అధినేత్రి సరళ మహేందర్ రెడ్డి జీవిత లక్ష్యం విద్యార్జనే ఉండాలని ఆ దిశగా విద్యార్థుల విద్య జీవన ప్రయాణం ఉండాలని తెలిపారు.

More articles

Latest article