26.3 C
Hyderabad
Monday, August 3, 2026

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా అపర్ణ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర  ప్రధాన కార్యదర్శిగా నాయక్ వాడి అపర్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో ఈ మేరకు అపర్ణకు నియామక పత్రాన్ని అందజేశారు. నిజామాబాద్ నగరానికి చెందిన అపర్ణ పట్టణ ఆర్యక్షత్రియ సంఘం గౌరవధ్యక్షురాలుగానూ, సీనియర్ మహిళా కాంగ్రెస్ నేతగా సుపరిచితులు. తనను రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించిన జాజుల శ్రీనివాస్ గౌడ్ కు, జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ లకు అపర్ణ ధన్యవాదాలు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం బలోపేతానికి తన వంతుగా పాటుపడుతానని అన్నారు.

More articles

Latest article