26.3 C
Hyderabad
Monday, August 3, 2026

పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మోర్తాడ్ మండల అధ్యక్షుడు భక్కోరియా ఆనంద్

 

మోర్తాడ్ బతుకమ్మ :

 

పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మోర్తాడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భక్కోరియా ఆనంద్ అన్నారు. శనివారం మోర్తాడ్ మండల కేంద్రంలో మోర్తాడ్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం ఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు మొత్తం రూ.3,14,500 విలువైన సీఎం ఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఆర్థిక సహాయం అందుకున్న 10 మంది లబ్ధిదారులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ ఇన్‌చార్జి ముత్యాల రాములు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహిపాల్, యూత్ మండల వైస్ ప్రెసిడెంట్ అర్గుల రమేష్, వివిధ విభాగాల మండల అధ్యక్షులు నాగభూషన్, అంజాద్, ఏఎంసీ డైరెక్టర్ నవీద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కోమిరే శ్రీధర్, ప్రదీప్, గురవయ్య, హర్షద్, మన్న, జమాల్, కొట్టూర్ గంగాధర్, లింగన్న, షఫీ, ఆల్మస్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

More articles

Latest article