24 C
Hyderabad
Sunday, August 2, 2026

నిజామాబాద్ లోనే పసుపు బోర్డు 

Must read

📰 Generate e-Paper Clip

  •  ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడి 
  •  నేడు పర్చువల్ గా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి
  • ఎన్నికల హామీని నిలబెట్టుకున్న ఎంపీ అరవింద్ 
  • పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డి
  • ముందే చెప్పిన బతుకమ్మ 

నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోనే జాతీయ పసుపు బోర్డు  ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడి 2023 అక్టోబర్ 1న మహబూబ్  నగర్ లో జరిగిన బహిరంగ సభలో తెలంగాణకే పసుపు బోర్డు అని ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే అత్యధికంగా పసుపు పండించే నిజామాబాద్ జిల్లాలోనే పసుపు బోర్డు ఏర్పాటవుతుందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పలుమార్లు ఈ విషయాన్ని అన్ని వేదికలపై స్పష్టం చేశారు. కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఏడాది పాలన గడిచిన పసుపు బోర్డు ఏర్పాటుపై ఎలాంటి  ప్రకటన  చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడగానే  పసుపు బోర్డును సాంగ్లీకి తరలిస్తారని ప్రచారం జరిగింది. అక్కడున్న ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర  ముఖ్యమంత్రి కూడా  పసుపు బోర్డు అంశాన్నిప్రస్తావించడంతో తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు అంశంపై  నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే గతేడాది చివరలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి  అరవింద్ కేంద్రమంత్రులతో పాటు హోంమంత్రి, వ్యవసాయ , పరిశ్రమల  మంత్రులతో పలు దఫాలుగా భేటీ అయి నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు  ఏర్పాటు ఆవశ్యకతను ప్రభుత్వానికి  గుర్తు  చేశారు.  స్వయంగా ప్రధాని నరేంద్రమోడి పసుపు బోర్డు  ఏర్పాటు ను ప్రకటన చేసిన  నేపథ్యంలో పార్టీ  రైతులకు ప్రధానంగా ప్రజలకు మాట  తప్పినట్లవుతుందని ఈ విషయాన్ని అధినాయకత్వం ద`ష్టికి తీసుకెళ్లారు.

Yellow board in Nizamabad itself

ప్రధానమంత్రి నరేంద్రమోడి, బొగ్గుగనుల శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డితో సోమవారం సమావేశం  అయ్యారు. హైదరాబాద్  కేంద్రంగా జరిగిన సమావేశంలోనే ఈ  మేరకు నిజామాబాద్ జిల్లాలోనే  పసుపు బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పసుపు బోర్డు కేంద్రంగానే రాజకీయ జీవితాన్ని  ప్రారంభించిన అరవింద్ కు బోర్డు ఏర్పాటు జీవన్మరణ  సమస్యగా మారిన  విషయం తెల్సిందే. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో అత్యధికంగా పసుపు పండించే రైతులు 2019లో జరిగిన  పార్లమెంట్ ఎన్నికల్లో 176 మంది బరిలో నిలిచి దేశం ద`ష్టిని ఆకర్షించిన విషయం తెల్సిందే. కేంద్రం ఇచ్చినట్లే ఇచ్చి మాట తప్పిందని ప్రతిపక్షాలు గోల చేయడంతో పాటు మహారాష్ట్ర  సైతం పసుపు బోర్డును తమ ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయడాన్ని అరవింద్ సవాల్ గా స్వీకరించారు. ఏకంగా కేంద్ర మంత్రులతో మంత్రాంగం నడిపించి పసుపు బోర్డు ఏర్పాటును చేయించి ఎన్నికల హామీని నెరవేరుస్తున్నట్లయింది. కాంగ్రెస్ హయంలో దాదాపు 30 సంవత్సరాలుగా పసుపు బోర్డు కోసం ఈ ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్న విషయం విధితమే. నిజామాబాద్ లో పసుపు బోర్డు స్థానంలో స్పైసెస్ బోర్డును వేల్పూర్ లో ఏర్పాటు చేసి మమ అనిపించారు గత ప్రభుత్వంలో. కమ్మర్ పల్లిలో పసుపు పరిశోదన కేంద్రానికి ఏర్పాటు  చేశారు, విస్తరణ పనులు మాత్రం అంతంత మాత్రంగానే  జరుగుతున్నాయి. పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే ఎంపీ పదవికి  రాజీనామా చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీని  నిలబెట్టుకునేందుకు  అరవింద్ చేసిన  ప్రయత్నాలు ఫలించి మరోసారి తెలంగాణ కేంద్రంలోనే మోడి పసుపు బోర్డు ఏర్పాటును ప్రకటించడంతో హర్షం వ్యక్తమౌతుంది.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇది వరకే పసుపు  ప్రాంతీయ బోర్డు ఏర్పాటును మోడి ప్రభుత్వం చేసిన విషయం తెల్సిందే. అయితే  ప్రాంతీయ బోర్డు కాకుండా పసుపు బోర్డు ఇక్కడే ఏర్పాటు చేయాలని పసుపు  రైతులతో పాటు ఎంపీ అరవింద్ ఇక్కడ ప్రజాప్రతినిధులు చేసిన విన్నపానికి మోడి అంగీకారం తెలిపి జిల్లా కేంద్రంలోనే పసుపు బోర్డు ఏర్పాటు జరుగనుంది. మంగళవారం రైతులకు సంక్రాంతి కానుకగా అన్నట్లుగా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయాల్ పర్చువల్ గా పసుపు బోర్డును ప్రారంభించనున్నారు.  పసుపు బోర్డు ఏర్పాటు అంశం నిజామాబాద్ జిల్లా నుంచే ప్రారంభం కాగా జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లె గంగారెడ్డికి తొలి చైర్మన్ గా నియామిస్తూ ఉత్తర్వులుజారీ అయ్యాయి. బోర్డు పాలకవర్గంతో పాటు ఇతర పాలకవర్గాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

Yellow board in Nizamabad itself

More articles

Latest article