27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పండగ వేళ ఎస్బిఐ బ్యాంక్ సర్వర్ సమస్య

Must read

📰 Generate e-Paper Clip

  • నిలిచిపోయిన ఫోన్ పే, గూగుల్ పే సేవలు
  • అవస్థలు పడుతున్న జనం

 నిజామాబాద్ సిటీ బతుకమ్మ : వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో దీనికి తోడు సంక్రాంతి పండగ రావడంతో సోమవారం నిజామాబాద్ లో  ఎస్బిఐ బ్యాంక్ సర్వర్ సమస్య ఏర్పడింది. దీంతో పండుగ పూట ముఖ్యమైన షాపింగ్ చేయాల్సిన వారు నగదు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంక్రాంతి పండగ పూట  సోమవారం ఎస్బిఐ బ్యాంక్ లో ఉదయం నుంచి సర్వర్ ప్రాబ్లం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ఫోన్లలో ఫోన్ పే, షాపింగ్ చేస్తూ బిల్లులు కడుతుంటున్నారు. అయితే షాపింగ్ లకు వెళ్లేవారు ఫోన్ పే సమస్య బ్యాంకు సర్వర్ ఏర్పడడంతో షాపింగ్ సరిగ్గా చేసుకోక అనేకమంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కువ మట్టుకు ఫోన్ పే వాడుకదారులు ఉండటంతో నగదురైత క్యాష్ ను ఎక్కువగా వినియోగించని పరిస్థితి ఈ మధ్యకాలంలో తగ్గింది. అయితే సరైన సమయంలో పండగపూట సర్వర్ ప్రాబ్లం నిలపడడంతో ఇబ్బందులకు గురవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

More articles

Latest article