ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గంలో ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ నాయకులకు చోటు కల్పించిన రాష్ట్ర బీజేపీ నాయకత్వం.జిల్లా ప్రధాన కార్యదర్శిగా వెంకటాపూర్ కు చెందిన బీజేపీ మాజీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా కార్యదర్శిగా పదిర కు చెందిన మాజీ మండల అధ్యక్షులు మద్దుల బుగ్గారెడ్డి,జిల్లా కార్యదర్శి గా కిస్టు నాయక్ తండ, రాజన్నపేట గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ ధరావత్ రజిత,జిల్లా ఐటీ సెల్ విభాగం కు రాజన్నపేటకు చెందిన ప్రకాష్ లను నియమించినట్లు ప్రకటించిన రాష్ట్ర నాయకత్వం.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్టీ భాద్యతలను నిర్వర్థిస్తూ, రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని వారు తెలిపారు.ఈ నియామకానికి సహకరించిన కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి లకు కృతజ్ఞతలు తెలిపారు.



