శ్రీరామ స్వర్ణపాదుకల పల్లకి యాత్ర

0 1,231

ఆర్మూర్, బతుకమ్మ : ఈనెల 17వ తేదీనప్రారంభమైన శ్రీరామ స్వర్ణపాదుకల యాత్ర శుక్రవారం ఆర్మూర్ పట్టణంలో జంబీ హనుమాన్ ఆలయం వరకు కొనసాగింది. ఈ పాదుకలు వివిధ రాష్ట్రాల గుండా అయోధ్యలోని శ్రీరామ మందిరం చేరుకొని అక్కడ పాదుకల పూజ నిర్వహించి తిరిగి హైదరాబాద్ చేరుకుంటాయి. అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని 13వేల గ్రామాలకు వాటిని పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా లక్ష మందితో రామ మాల ధారణ దీక్ష ప్రారంభం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవ సమితి ఆర్మూర్ అధ్యక్షులు పెంట జలంధర్ చారి, రేగుళ్ల సత్యనారాయణ, గురుస్వాములు జనార్దన్ గౌడ్, మసాలా సత్యనారాయణ, మీసాల రాజేశ్వర్, చేపూర్ ధనుంజయ్, ఉదయ్, కోలు శేఖర్, యోగి గంగాధర్ గౌడ్  మీసాల రవి, నందు, రామరాజ్యం ట్రస్టు సభ్యులు నంగి దేవేందర్ రెడ్డి, రాకేష్ గౌడ్, విజయ్, రంగ ,దర్శన్, డా. రొహిత్ కుమార్, తిరునగరి మహేందర్ రెడ్డి, చైతన్య రెడ్డి పాల్గొన్నారు.

Yatra to Sri Rama's golden footed palanquin

Leave A Reply

Your email address will not be published.