శ్రీరామ స్వర్ణపాదుకల పల్లకి యాత్ర

ఆర్మూర్, బతుకమ్మ : ఈనెల 17వ తేదీనప్రారంభమైన శ్రీరామ స్వర్ణపాదుకల యాత్ర శుక్రవారం ఆర్మూర్ పట్టణంలో జంబీ హనుమాన్ ఆలయం వరకు కొనసాగింది. ఈ పాదుకలు వివిధ రాష్ట్రాల గుండా అయోధ్యలోని శ్రీరామ మందిరం చేరుకొని అక్కడ పాదుకల పూజ నిర్వహించి తిరిగి హైదరాబాద్ చేరుకుంటాయి. అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని 13వేల గ్రామాలకు వాటిని పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా లక్ష మందితో రామ మాల ధారణ దీక్ష ప్రారంభం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవ సమితి ఆర్మూర్ అధ్యక్షులు...