29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

భవన నిర్మాణ రంగ కార్మికులపై చిన్నచూపు తగదు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఇస్తామని చెప్పిన హామీలను అధికారంలోకి రాగానే మరుస్తున్నారని బిఎన్ఆర్ కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రం అన్నారు. పోరాటాలతోనే హక్కులను సాధించుకోగలుగుతామని అందుకోసం ఉద్యమాలు ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో భవన నిర్మాణ కార్మిక రంగాల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయనను ఘనంగా సన్మానించారు. అవగాహన సదస్సులో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు జిల్లా అధ్యక్షుడు కల్లెడ గంగాధర్ మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి నెరవేరుస్తామని అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ హామీలను నెరవేర్చ లేదన్నారు. సమస్యల సాధన కోసం జనవరి 8, 9 తేదీలలో హైదరాబాద్లోని ధర్నా చౌక్ లో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబురావు షిండే నరేందర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Construction workers should not be underestimated

More articles

Latest article