బతుకమ్మ,మోర్తాడ్: ప్రజల పక్షాన ఎల్లవేళలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, అన్నివేళలా అండగా ఉంటుందని మోర్తాడ్ మండల యువజన నాయకుడు అడవల మనోజ్ అన్నారు. శుక్రవారం మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లి గ్రామంలోని ఆరుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు లక్మ రంజిత్, మాజీ యూత్ అధ్యక్షులు గురిజాల నర్సారెడ్డి, దేవేందర్, నవీన్,అజయ్,గంగనర్సయ్య, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
