27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అరుదైన శస్త్ర చికిత్సతో తల్లిబిడ్డలను కాపాడిన యశోద ఆస్పత్రి వైద్యులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విలేకరుల సమావేశంలో డాక్టర్ జి. విక్రమ్ కుమార్

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న ఒక యువ గర్భిణీకీ సకాలంలో వైద్యం అందించి రెండు ప్రాణాలను కాపాడగలిగామని సోమాజిగూడ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ క్లినికల్ హెమటాలజిస్ట్ అండ్ బీఎంటీ ఫిజీషియన్, డాక్టర్ జి.విక్రమ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని యశోద మెడికల్ సెంటర్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ గర్భిణికి ప్రాణాంతకమైన  థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్పురా (టీటీపీ ) అనే అరుదైన  రక్తసంబంధిత వ్యాధితో బాధపడుతుండగా సకాలంలో వ్యాధిని గుర్తించి వైద్యం అందించడం జరిగిందన్నారు. పేషేంట్ అత్యంత విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చేరగా, ఆసుపత్రిలోని మల్టీడిసిప్లినరీ బృందం వేగంగా స్పందించి వ్యాధిని నిర్ధారించిందన్నారు. తక్షణమే అత్యవసర చికిత్సను అందించి, తల్లి, గర్భస్థశిశువు ఇద్దరికీ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా భదత్ర కల్పించిదన్నారు. హెమటాలజీ బృందం వెంటనే వ్యాధిని నిర్ధారించి, టీటీపీకి అంతర్జాతీయంగా ఆమోదించబడిన అత్యుత్తమ చికిత్స అయిన థెరప్యూ టిక్ ప్లాస్మా ఎక్స్ఛేంజ్ (ప్లాస్మా ఫెరిసిస్) ను, కార్టికోస్టెరాయిడ్ థెరపీతో కలిపి వెంటనే ప్రారంభించామన్నారు.పేషేంట్ ఈ చికిత్సకు అద్భుతంగా స్పందించిన్నట్లు పేర్కొన్నారు. ఆమె ప్లేట్లెట్ కౌంట్ వేగంగా కోలుకొని మొత్తం ఆరోగ్యం నిలకడగా మారిందన్నారు. హెమటాలజీ  పస్రూతి బృందాల నిరంతర పర్యవేక్షణలో ఆమె గర్భం సురక్షితంగా కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం తల్లి,బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారన్నారు. “థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్పు రా అనేది అరుదైన కానీ ప్రాణాంతకమైన మెడికల్ ఎమర్జెన్సీ చికిత్స చేయకపోతే ఇదిచాలా వేగంగా తీవ్రమవుతుందన్నారు. గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరినీ రక్షించడానికి, వ్యాధిని ముందుగా గుర్తించడం, వేగంగా నిర్ధారించడం తక్షణం థెరప్యూటిక్ ప్లాస్మా ఎక్స్ ఛేంజ్ ప్రారంభించడం చాలా ముఖ్యం అని సకాలంలో నిపుణుల జోక్యం సమన్వయంతో కూడిన మల్టీడిసిప్లినరీకేర్ విజయవంతమైన ఫలితాలను సాధించడంలో ఎంత ముఖ్యమో ఈ కేసు స్పష్టం చేస్తుందని అన్నారు. టీటీపీ అనేది ఒక అరుదైన రక్తసంబంధ వ్యాధి అని ఇందులో శరీరం అంతటా చిన్న చిన్న రక్తపు గడ్డలు ఏర్పడతాయన్నారు. దీని వల్ల ప్లేట్లెట్ కౌంట్ తీవ్రంగా పడిపోవడం, ఎర్రరక్తకణాలు నాశనం కావడం, మెదడు, మూతప్రిండాలు, గుండెవంటి ముఖ్యమైన అవయవాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందన్నారు. గర్భధారణ సమయంలో ఇతర సమస్యలలక్షణాలు  ఈ వ్యాధి లక్షణాలు ఒకేలా ఉండటం వల్లఈ వ్యాధిని గుర్తించడం సవాలుతో కూడుకున్నదన్నారు. కాబట్టి వ్యాధిని త్వరగా గుర్తించడం మరింత కీలకమన్నారు.ఈ విజయవంతమైన ఫలితం, అత్యధునాతన రోగనిర్ధారణ పద్ధతులు, థెరప్యూ టిక్ ప్లాస్మా ఎక్స్ఛేంజ్ సౌకర్యాలు  సమన్వయంతో కూడిన మల్టీడిసిప్లినరీకేర్ ద్వార సంక్లిష్టమైన హెమటాలాజికల్ ఎమర్జెన్సీ లను నిర్వహించడంలో సోమాజిగూడ యశోద హాస్పిటల్ కు ఉన్న అత్యుత్తమ నైపుణ్యా న్ని ప్రతిబింబిస్తుందన్నారు.ఈ సమావేశంలో సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ రూపేష్ షిండే, సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎం. అమర్నాథ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article