29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బంజపల్లిలో ఘనంగా కుస్తీ పోటీలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరు

 

నిజాంసాగర్, బతుకమ్మ :

 

నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మందిరంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అనంతరం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఏలే సుగుణమ్మ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరై పోటీలను ప్రారంభించారు.

 

Wrestling competitions held in Banjapalli

 

యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే ఈ తరహా కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. గ్రామ యువకులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. గ్రామ ప్రజలు, నాయకులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

Wrestling competitions held in Banjapalli

More articles

Latest article