బిఆర్విఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్
ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి గురుకుల పాఠశాలలోని విద్యార్థుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని బీఆర్విఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్ అన్నారు. రాష్ట్ర బి ఆర్ వి ఎస్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా ఇన్చార్జి గా సబ్బన హరీష్ ను నియమించిన సందర్భంగా బుదవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మైనార్టీ సంక్షేమ, సాంఘిక గురుకులాలను బి ఆర్ ఎస్ నాయకులతో సందర్శించారు. వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల సమస్యలపై విద్యార్థులను భోజన, యూనిఫాం కాస్మెటిక్ వసతులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గురుకులాల్లో ఉన్న వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అని ఆయన మండిపడ్డారు, అంతేకాకుండా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని పలువురు విద్యార్థులు వారి దృష్టికి తెచ్చారని తెలిపారు. గత ప్రభుత్వంలో గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను రాను రాను నిర్వీర్యం చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇప్పటివరకు దాదాపుగా 40 మంది విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే గురుకులాలపై శ్రద్ధ చూపి విద్యార్థుల ప్రాణాలు పోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాను, దీపక్, పర్షురాం, ఎల్లారెడ్డి పట్టణ బారాసా పట్టణ అధ్యక్షుడు అది మూలం సతీష్ కుమార్, ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షులు యేగుల నర్సింలు, నాగం సురేందర్, ఇమ్రాన్, అరవింద్ గౌడ్, మనోజ్, దయాకర్, భార్కాత్, సత్యం తదితరులు పాల్గొన్నారు.

