మోర్తాడ్, బతుకమ్మ: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అన్ని విధాలుగా పాటుపడుతోందని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. శుక్రవారం మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో గొర్రెల షెడ్లు, పశువుల షెడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల ఏ పీ వో శకుంతల, ఏ ఏం సీ డైరెక్టర్ మహిపాల్, ఆనంద్, కాంగ్రెస్ నాయకులు సాయి రెడ్డి, రాజేష్, గంగ నరసయ్య, ఏం సీ గంగాధర్, రఘుపతి రెడ్డి, నరసింహారెడ్డి, మల్లేష్, రమేష్, కార్యకర్తలు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
