ముంబై, బతుకమ్మ :
ముంబై మహా నగరంలో “పార్లే బంగారు బతుకమ్మ మండల్” ఆధ్వర్యంలో పరాభవ నామ ఉగాది నూతన సంవత్సరం పురస్కరించుకొని మహిళలు పసుపు కుంకుమ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇందిరానగర్ చాల్ నం:2 లో నివసించే తెలుగు, తెలుగేతర స్త్రీలందరు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విలేపార్లే వార్డ్ నం:70 నగర్ సేవక్ అనీష్ నవల్ మక్వాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకీ గుడిపాడ్వా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరు కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరారు. తెలుగువారి ఉగాది కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందనన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక స్త్రీలతో పాటు చుట్టూ ప్రక్కన ఇందిరా నగర్ తదితర ఏరియాల్లో నివసించే స్త్రీలు పాల్గొని విజయవంతం చేశారు. అలాగే స్థానిక ప్రముఖ రాజకీయ నాయకులైన హేమంగ్ జంగల, చిత్రేష్ మూలాజీ, తప్పన్ మేత తదితరులు పాల్గొన్నారు.
