25.4 C
Hyderabad

సహనం కోల్పోయిన సామాన్య ప్రజలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . వీఐపీ కాన్వాయ్ వాహనాలను అడ్డుకున్న ప్రజలు

 

. . . రాజస్థాన్ లో ఘటన

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

ప్రజల సహనానికి ఓ హద్దు ఉంటుంది. 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఓ విఐపి ప్రోటోకాల్ కోసం 45 నిమిషాల పాటు ట్రాఫిక్ ఆపేశారు. ఎండలో జనం అల్లాడిపోయారు. కొంతమంది స్పృహ తప్పి పోయారు. దీంతో ఇక తట్టుకోలేని జనం తిరగబడ్డారు. కాన్వాయ్ వాహనాలను అడ్డుకొని చెడామడా తిట్టేశారు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో శనివారం చోటు చేసుకుంది. ఏసీ కార్లలో వచ్చే మీకు, ఎండలో ఉన్న వారి బాధలు ఏం తెలుసు అని ప్రజలు నిలదీశారు. ఇంతసేపు ట్రాఫిక్ ఎందుకు ఆపాల్సి వచ్చిందని వీఐపీలను తిట్టి పోశారు. దీంతో పోలీసులు దండం పెట్టి, నచ్చజెప్పి వారిని వదిలేశారు. ఇలాంటి ప్రోటోకాల్ కష్టాలు జనానికి చాలా కాలంగా ఉన్నవే. ఇప్పటికీ అవి కొనసాగడం, అది కూడా ఎడారి ప్రాంతంలో ట్రాఫిక్ ఆపేసి ఇలా చేయడం అనేది మరీ ఘోరం.

More articles

Latest article