30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎస్.ఎస్.ఆర్ డిస్కవరీ పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  దీనిలో భాగంగా ఉపాధ్యాయునిలు వివిధ ఆటపాటలతో పాటు మహిళల ఔన్నత్యాన్ని కొనియాడుతూ ఉపన్యసించారు.  ఆటపాటల్లో పాల్గొని ప్రథమ , ద్వితీయ స్థానాలలో విజేతలైన ఉపాధ్యాయునులకు చైర్మన్, సీఈఓ బహుమతి ప్రదానం చేశారు. పాఠశాల చైర్మన్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ

Women's Day celebrations at SSR Discovery School

మహిళలు అన్ని రంగాలలో ముందుండటమే కాక, మహిళలు కుటుంబానికే గాక, సమాజానికి వెన్నెముక వంటి వారని అన్నారు. ఓర్పులో భూదేవి వంటి వారిని ప్రశంసించారు. చివరిగా ఉపాధ్యాయునిలకు సీఈవో హరిత గౌడ్ బహుమతుల నిచ్చి తమదైన శైలిలో సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మారయ్య గౌడ్,సీఈవో హరిత గౌడ్ , డైరెక్టర్ హర్షిత్ గౌడ్, ప్రిన్సిపల్ భాస్కర్ మెరిగ, మహిళా ఉపాధ్యాయునిలు పాల్గొన్నారు.

Women's Day celebrations at SSR Discovery School

More articles

Latest article