ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎస్.ఎస్.ఆర్ డిస్కవరీ పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  దీనిలో భాగంగా ఉపాధ్యాయునిలు వివిధ ఆటపాటలతో పాటు మహిళల ఔన్నత్యాన్ని కొనియాడుతూ ఉపన్యసించారు.  ఆటపాటల్లో పాల్గొని ప్రథమ , ద్వితీయ స్థానాలలో విజేతలైన ఉపాధ్యాయునులకు చైర్మన్, సీఈఓ బహుమతి ప్రదానం చేశారు. పాఠశాల చైర్మన్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండటమే కాక, మహిళలు కుటుంబానికే గాక, సమాజానికి వెన్నెముక వంటి వారని అన్నారు. ఓర్పులో భూదేవి వంటి వారిని ప్రశంసించారు....