25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎంపీ అరవింద్ తన స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారు

Must read

📰 Generate e-Paper Clip

  • ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నాయకులు

 

బతుకమ్మ బోధన్ : ఎంపీ అరవింద్ తన స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారని టిపిసిసి డెలికేట్ గంగా శంకర్, పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పాషా మొయినుద్దీన్ ఆధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టిపిసిసి డెలికేట్ గంగా శంకర్, పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్ మాట్లాడుతూ ఎంపీ అరవింద్ తన స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారని, అందులో భాగంగా నవోదయ విద్యాలయానికి మాజీ మంత్రి, బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి అడ్డుపడుతున్నారని వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనిని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎంపీగా తను రెండవసారి గెలిచి బోధన్ అభివృద్ధిలో ఎలాంటి పాత్ర పోషించడం లేదని, చేతనైతే సంవత్సరం క్రితం వర్చువల్ గా ప్రారంభించిన రైల్వే ఓవర్  బ్రిడ్జ్ పనిని ప్రారంభించాలని అన్నారు. అంతేగాని మీకు తండ్రి సమానులైన మా ఎమ్మెల్యే పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో  ప్రముఖ నాయకులు నాగేశ్వరరావు, అంకు దామోదర్ రెడ్డి, ఆదినారాయణ, హరికాంత్ చారి, రాములు, తల్లారి నవీన్, చిరంజీవి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article