నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాని వుమెన్స్ ఎంపవర్ మెంట్ సెల్ ఆధ్వర్యలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.రాంమోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జెండర్స్ బేస్డ్ వయోలెన్స్ అవేర్నెస్ అండ్ ప్రివెన్సన్ అనే అంశంపై అధ్యాపకులకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా వెల్ఫేర్ అధికారి రసూల్ బీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విద్యార్థలకు సమాజంపై ఉన్న అసమానతలపై, లింగ వివక్ష, బాల్య వివాహాలు అనే అంశాలపై వివరించారు. విద్యార్థులు తమకున్న అన్ని అవకాశాలను సద్వనియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, వివిధ శాఖల అధ్యక్షులు భరత్ రాజ్, గంగాధర్, రాజేష్, దండుస్వామి, డబ్యూఈసీ సమన్వయకర్త నహీదా బేగం, సభ్యులు రజిత, తబస్సుం, డా.ఉమాకిరణ్, అనసూయ, రజిత, ప్రతిభ, అధ్యాపకులు పాల్గొన్నారు.