డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఘనంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నిఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మినీ సెమినార్ హాల్లో ఉమెన్స్ సెల్ డైరెక్టర్ డాక్టర్ భ్రమరాంబిక అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ ఆరతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 19వ శతాబ్దం పూర్వార్ధంలోనే మహిళా విద్య ప్రాధాన్యతను గుర్తించి విద్య విస్తరించడం కోసం కృషి చేసిన వారిలో సావిత్రిబాయి పూలే మొదటి సామాజిక విప్లవకారిని అని కొనియాడారు. మహిళలు విద్యారంగంలో ముందుంటే ఆ సమాజం శాస్త్రీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుంటుందని సావిత్రి బాయి పూలే మహిళా విద్యాలయాలు ప్రారంభించారని తెలిపారు. ఆర్ట్స్ డీన్ ఆచార్య లావణ్య మాట్లాడుతూ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించడం ఆనందకరమైన విషయమని తెలిపారు. ఈ క్రమంలో సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను నేర్చుకోవాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి మహిళా అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కైసర్ మహమ్మద్, డాక్టర్ నందిని, డాక్టర్ స్రవంతి, డాక్టర్ శాంతాబాయి, డాక్టర్ పార్వతి, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ సమత, డాక్టర్ గుల్ ఏ రానా, సూపర్డెంట్ ఉమారాణి, బోధన బోధనేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
