తెయూలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఘనంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నిఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మినీ సెమినార్ హాల్లో ఉమెన్స్ సెల్ డైరెక్టర్ డాక్టర్ భ్రమరాంబిక అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ ఆరతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 19వ శతాబ్దం పూర్వార్ధంలోనే మహిళా విద్య ప్రాధాన్యతను గుర్తించి విద్య విస్తరించడం కోసం కృషి చేసిన వారిలో సావిత్రిబాయి పూలే మొదటి సామాజిక విప్లవకారిని అని కొనియాడారు. మహిళలు విద్యారంగంలో...