ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ సర్వసమాజ్ అధ్యక్షుడు గా కొట్టల సుమన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ సర్వసమాజ్ అంటే ఆర్మూర్ ప్రజాప్రతినిధులకు ప్రతిరూపమని ఇక్కడ అవినీతి జరిగిన వెంటనే సర్వ సమాజ్ స్పందించాలని అన్నారు. పార్టీలకతీతంగా సర్వ సమాజం ఉండాలని, సర్వ సమాజ్ అభివృద్ధి కి ఎల్లపుడూ సహకరిస్తారని అన్నారు.