23.7 C
Hyderabad

ఎల్లారెడ్డిలో రూ.42.80 కోట్లతో రహదారులకు మహర్దశ

Roads in Yella Reddy to receive Rs. 42.80 crore

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి సీతక్క

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ఫేజ్ – 1 కింద రూ.42.80 కోట్ల వ్యయంతో మొత్తం 71.63 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. రామారెడ్డి మండల పరిధిలోని పోసానిపేట, రంగంపేట గ్రామాల సరిహద్దులో ఉన్న మోషంపూర్ చౌరస్తా వద్ద పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ తో కలిసి మంగళవారం రహదారి అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ రహదారుల అభివృద్ధితో గ్రామాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటంతో పాటు రైతులు, విద్యార్థులు, వ్యాపారులు, సామాన్య ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు తగ్గనున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ రహదారులు ఎంతో దోహదపడనున్నాయన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు సైతం మెరుగైన రహదారి సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.

More articles

Latest article