30.9 C
Hyderabad
Monday, August 3, 2026

కలెక్టరేట్ ముందు బీఏఎస్ విద్యార్థుల తల్లిదండ్రుల ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

  • పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని వినతి

 

నిజామాబాద్, బతుకమ్మ : బెస్ట్ అవేలేబుల్ విద్యార్థుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కలెక్టరేట్ ముందు విద్యార్థుల తల్లిదండ్రలు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గం విద్యార్థుల కోసం బెస్ట్ అవేలేబుల్ స్కీం తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వ ఆలోచన బాగున్నప్పటికీ గత మూడు సంవత్సరాలుగా ఈ స్కీంను ఉపయోగించుకుని చదివే విద్యార్థులకు రావలసిన డబ్బులు ప్రభుత్వం చెల్లించలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26వేల మంది విద్యార్థులు ఈ స్కీం ఉపయోగించుకుని చదువుకుంటున్నారని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు రూ.300కోట్లు విద్యార్థులకు చెల్లించనందు వల్ల విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. దీంతో విద్యార్థుల జీవితాలు అయోమయ స్థితిలో ఉన్నాయన్నారు. పాఠశాలలు వేసవి సెలవుల తర్వాత జూన్ 12న ప్రారంభమయ్యాయని, ఇంత వరకు పాఠశాలల నుంచి ఇప్పటి వరకు విద్యార్థులను పంపించాలని సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఇప్పటి వరకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని పాఠశాల యాజమన్యాలను అడిగితే మీ పిల్లలను తీసుకురావద్దని, గత మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేదని కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నాయని తెలిపారన్నారు. ఇంత భారాన్ని తాము మోయలేమని, ఒకవేళ మీరు డబ్బులు చెల్లిస్తే మీ పిల్లలను చేర్చుంటామని స్కూల్ యాజమన్యాలు చెబుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై చాలాసార్లు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ అధికారలు పట్టించుకోక పోవడం వల్ల పిల్లల భవిష్యత్తు ఏమైపోందోనని ఆందోళనగా ఉందన్నారు.  ఇప్పటికైనా ప్రభుత్తం పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పిల్లల భవిష్యత్తును ఆలోచించి వెంటనే పెండింగ్ బిల్లులు రెండు రోజుల్లో మంజూరు చేయాలని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article