. . . జిల్లాలో రెండు వెర్వేరు చోట్ల ఘటనలు
. . . పోలీస్ శాఖ దాడులు చేసిన ఆగని విక్రయాలు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి పండగ వేళ పతంగుల దారం యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. చైనా మాంజా ( నైలాన్ ) తో యువకుల గోంతుకలు తెగాయి. జిల్లా వ్యాప్తంగా టాస్క్ పోర్స్, ఆటవి శాఖ, పోలీస్ శాఖలు పతంగుల దుకాణాలపై దాడులు చేసిన చైనా మాంజా విక్రయాలు జరుగితే వాటిని వినియోగించి గాయపడ్డారు. నవిపేట్ మండల కేంద్రంలో చైనా మాంజాతో సుభాష్ నగర్ కు చెందిన అద్నాన్ (18) యువకుడి గొంతు కట్ అయింది. మండల కేంద్రంలోని స్టేషన్ ఏరియా ప్రాంతంలో చైనా మాంజాతో ఉన్న పతంగి తెగిపోగా పట్టుకునేందుకు ప్రయత్నించిన అద్నాన్ మెడకు చుట్టుకోవడంతో గొంతకుకు చుట్టుకోని తెగింది. మాంజాను తీసేందుకు చేతితో ప్రయత్నించగా కుడి చేతి వేళ్ళు సైతం తెగాయి. గొంతుకు, చేతి వేళ్లకు నాలుగు కుట్లు పడ్డాయి. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గుజ్జేటి ప్రవీణ్ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గాలి పటం మాంజ గొంతుకు చుట్టుకుని కోసుకుపోయింది. దీంతో స్థానికులు వెంటనే ప్రమాదం జరిగిన వ్యక్తి ని ఆర్మూర్ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.

