26.3 C
Hyderabad
Monday, August 3, 2026

జిల్లాకు పసుపు బోర్డు రైతుల పోరాట ఫలితమే

Must read

📰 Generate e-Paper Clip

… సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ  స్వాగతిస్తున్నదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు.   జిల్లాలో రైతాంగం సుదీర్ఘ పోరాటాల ఫలితంగా పసుపు బోర్డు రావడం జరిగిందని, ఇది రైతు, ప్రజా పోరాటాల ఫలితమేనని మంగళవారం న్యూడెమోక్రసీ జిల్లా కార్యాలయం (ఎన్.ఆర్. భవన్ ) లో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య తో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాపయ్య  అన్నారు. పసుపు బోర్డు రావడం వల్ల కొత్త కొత్త వంగడాలు, కొత్త పరిశోధనలు చేయడానికి ఉపయోగపడుతుంది అన్నారు. వీటితో పాటు పసుపు పండించిన రైతుకు గిట్టుబాటు ధర, పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం రైతుకు దక్కినప్పుడే ఈ బోర్డు ఏర్పాటు సార్థకం అవుతుంది అన్నారు.  వ్యవసాయ రంగా అభివృద్ధికి పంటల గిట్టుబాటు ధరలకై ఎమ్మెస్పీ మద్దతు ధరల చట్టనికై పోరాడుతున్న పంజాబ్ రైతు జగదీష్ సింగ్  ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా ఆ రైతులతో  చర్చలు జరిపి  దీక్ష విరమణ చేసి రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని   డిమాండ్ చేశారు.  పసుపు బోర్డు తో పాటు ఈ జిల్లాలో రెండు చక్కర ఫ్యాక్టరీలను తెరిపించే  దాంట్లో కేంద్ర ప్రభుత్వ సహకారం బాధ్యత ఉందని ఎన్నికల్లో చెప్పిన నిజామాబాద్ ఎం.పీ రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి తెరిపించడానికి కృషి చేయాలని అన్నారు.  ఈ విలేఖరుల సమావేశంలో న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు నీలం సాయిబాబా,  ఇప్టూ నాయకులు ఎం. శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

More articles

Latest article