బతుకమ్మ,మోర్తాడ్: క్రీడల్లో గెలుపోవటములను సమానంగా తీసుకోవాలని క్రీడలతో మానసిక ఉల్లాసం ఉంటుందని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. క్రీడల్లో గెలుపొందిన జట్లకు ఆమె బహుమతులు అందజేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ గిర్మాజి గోపి మాట్లాడుతూ గెలిచినవారు సంతోషంతో కాకుండా ఓడిన వారు కృంగిపోకుండా స్నేహభావంతో అందరూ కలిసి ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కప్ మండల స్థాయి క్రీడలు మోర్తాడ్ మండల కేంద్రంలో బుధవారం ముగిశాయి.
మహిళ కబడ్డీ విభాగంలో మొదటి స్థానం మోర్తాడ్, ద్వితీయ స్థానంలో తిమ్మాపూర్ నిలిచాయి.
కబడ్డీ పురుషుల విభాగంలో శేట్ పల్లీ మొదటి స్థానం నిలువగా, తిమ్మాపూర్ ద్వితీయ స్థానంలో నిలిచింది. పురుషుల వాలీబాల్ విభాగంలో మొదటి స్థానం మోర్తాడ్ నిలువగా, ద్వితీయ స్థానంలో శెట్ పల్లీ నిలిచింది.
వాలీబాల్ బాలికల విభాగంలో తిమ్మాపూర్ మొదటి స్థానంలో మోర్తాడ్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి.
ఖో ఖో పురుషుల భాగంలో మోర్తాడు జట్టు పథమ స్థానంలోనిలువగా, తిమ్మాపూర్ ద్వితీయ స్థానంలో నిలిచింది.
ఖో ఖో మహిళ విభాగంలో మోర్తాడ్ చేస్తాం ప్రథమ స్థానంలో నిలువగా సుంకేట్ జట్టు, ద్వితీయ స్థానం నిలిచింది. కార్యక్రమంలో మోర్తాడ్ మండల విద్యాధికారి సమ్మిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, మోర్తాడ్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు జక్కం అశోక్, మోర్తాడ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉప్పల అశోక్, ముత్యాల సునీల్ యువసేన సభ్యులు తక్కురి సతీష్, గంగాధర్, మోర్తాడ్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మొయినుద్దీన్, సుంకేట్ ప్రధానోపాధ్యాయులు సంతోష్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ శ్యామ్, వ్యాయామ ఉపాధ్యాయులు సింధుజ, రాజు, ప్రదీప్, గురిజాల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

