28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మోడీని ఒప్పించి కుల గణన చేయిస్తావా..?

Must read

📰 Generate e-Paper Clip

  • మినరల్స్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవర్తి అనిల్

 

నిజామాబాద్, బతుకమ్మ : మోడీకి మోకరిల్లుతావా.. లేక మోడీని ఒప్పించి కుల గణన చేయిస్తావా అని కేంద్రమంత్రి బండి సంజయ్ కు మినరల్స్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవర్తి అనిల్ సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికి కార్పొరేటర్ అనుకొని మాట్లాడుతున్నారని అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. హైదరాబాద్ వరదల సమయంలో బండి పోతే బండి కారు పోతే కారు ఇస్తామని చెప్పి తర్వాత ఇన్సూరెన్స్ ఉంది కదా అన్నాడని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసుకున్నారో కానీ బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి ఉన్నాడని విమర్శించారు. ముస్లిం లను బీసీలలో చేర్చితే చూస్తూ ఊరుకోం అని బండి సంజయ్ అంటున్నాడని, మాట్లాడే ముందు మేధావులతో చర్చించి మాట్లాడాలని అన్నారు. ముస్లిం లకు రిజర్వేషన్ ఇస్తే ఒప్పుకోం అంటున్నాడని, మండల్ కమిషన్ గురించి బండి సంజయ్ తెలుసుకోవాలని సూచించారు. హిందూ బీసీ లు 43 శాతం, ముస్లిం బీసీలు 8 శాతం ఉన్నారని మండల్ కమిషన్ సిఫార్సు చేసిందన్నారు. ప్రభుత్వం 27 శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలకు విద్య,ఉద్యోగం లో కల్పించిందని పేర్కొన్నారు. అందులో ముస్లిం లు కూడా ఉన్నారని తెలిపారు.  ఓబీసీ లలో ముస్లిం లు సెంట్రల్ లిస్ట్ లో ఉన్నారన్నారు. ఇది కూడా అవగాహన లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాలకు క్యాటగిరి చేసుకునే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలన్నారు. బీసీల లో క్రైస్తవులు కూడా ఉన్నారని, బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తే బీజేపీ మనుగడ ఉండదు అని వాళ్లకు తెలుసని అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10శాతం ఇచ్చిన మీరు.. బీసీలకు రిజర్వేషన్ ఎందుకు పెంచారని ప్రశ్నించారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి రా పోరాటం చేద్దాం అని సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కులం ఎందుకు గుణం ముఖ్యమని.. కుల గణన వద్దు అంటున్నాడని, గణన లేకుండా రిజర్వేషన్ పెంపు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్ పెంపు కు చట్టం చేయబోతున్నామని తెలిపారు.

More articles

Latest article