23.4 C
Hyderabad

మహిళలందరిని చైతన్యం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • డీఆర్డీఓ సాయాగౌడ్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలో గల మహిళా సంఘా సభ్యులకు ఆరోగ్యం..పిల్లల పోషణ,పరిసరాలు పరిశుభ్రత,పారిశుధ్యం,రక్తహీనత, సమతుల ఆహారం తీసుకునేలా ,గర్భవతిగా తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలగు అంశాలపై అవగాహన కల్పించాలని  ఏపీఎంఎస్, సీసీ లకు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కోరారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం లో గల సమావేశ మందిరంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందికి దిశ నిర్దేశం చేశారు. ఆదాయం పెరిగిన దానికి తగిన విధంగా ఖర్చులు పెరిగినా విధంగా జీవన శైలి లో మార్పులు, మంచి ఆహారపు అలవాట్లు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, మంచి ఆహారపు అలవాట్లు జీవన ప్రమాణాలను పెంచుతాయి అని,ఆరోగ్యమే మహాభాగ్యం గా  మహిళలందరూ జీవించాలని కోరారు.ఈ శిక్షణ కార్యక్రమాల్లో అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ ,రిసోర్స్ పర్సన్ లు గా డీపీఎంసాయిలు, శ్రీనివాస్ ఏపీఎంఎస్ సరోజినీ, గంగాధర్ రాజేందర్ అన్ని మండలాలు ఏపీఎం లు,సీసీ లు తదితరులు పాల్గొన్నారు.

All women should be sensitized

More articles

Latest article