మోడీని ఒప్పించి కుల గణన చేయిస్తావా..?
మినరల్స్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవర్తి అనిల్ నిజామాబాద్, బతుకమ్మ : మోడీకి మోకరిల్లుతావా.. లేక మోడీని ఒప్పించి కుల గణన చేయిస్తావా అని కేంద్రమంత్రి బండి సంజయ్ కు మినరల్స్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవర్తి అనిల్ సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికి కార్పొరేటర్ అనుకొని మాట్లాడుతున్నారని అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. హైదరాబాద్ వరదల సమయంలో బండి పోతే బండి కారు పోతే కారు ఇస్తామని చెప్పి తర్వాత ఇన్సూరెన్స్ ఉంది కదా అన్నాడని...