27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సామాగ్రి బయట వేసి ఇంటికి తాళం

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : ఇంటి సామాగ్రిని ఇంటి బయట వేసి ఇంటికి తాళం చేశారని ఎస్సీ హాస్టల్లో పనిచేసి రిటైర్డ్  అయినా ప్రభుత్వ ఉద్యోగి తుమ్మగల్ల బాలమణి ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పలుగడ్డ కాలనీలో నివాసముంటున్న ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ గా పనిచేసి రిటైర్డ్ ఉద్యోగి తుమ్మగల్ల బాలమణి మీడియాతో మాట్లాడారు. 2000 సంవత్సరంలో ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్నప్పుడు వల్లకాటీ నర్సయ్య ఇంట్లో అద్దెకు ఉండడం జరిగిందని అతను బాంబేలో ఉంటాడని  అప్పటినుండి ఇప్పటివరకు ప్రతినెలా అద్దె కట్టడం జరిగిందని తెలిపారు. గత నాలుగు సంవత్సరాల క్రితం పోగుల రవి అనే వ్యక్తి ఇల్లు కొన్నానని తన ఇంటి సామాగ్రిని ఇంటి బయట వేసి ఇంటికి తాళం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పైన దోమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాని తెలిపారు. బిక్కనూరు సిఐ ఇద్దరిని పిలిపించి మాట్లాడి ఒప్పంద పత్రం రాయించుకున్నారని తెలిపారు. తాను ఇల్లు కొంటానని తను ఉంటున్న ఇంటికి మరమ్మతులు చేసుకోవడం జరిగిందని తెలిపారు. మరమ్మత్తుల ఖర్చులు రెండు లక్షల పైగా అయిందని అన్నారు. డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండానే తన ఇంటి సామాగ్రి మొత్తాన్ని ఇంటి  బయటపడేసి గత 18 రోజులు అవుతుందని తెలిపారు. తాను ఉంటున్న ఇల్లుకు  మరమ్మత్తులు చేసిన ఖర్చు డబ్బులు రెండు లక్షల రూపాయలు ఇప్పించాలని అధికారులను, జిల్లా కలెక్టర్ ను కోరారు.

Put the stuff out and lock the house

More articles

Latest article