27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సందీప్ కుమార్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని, కార్యకర్తలతో కలిసి ప్రజలకు చేరువయ్యే విధంగా సేవలందిస్తానని కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఐరేణి సందీప్ కుమార్ తెలిపారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నీ ఆదివారం ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు ప్రత్యేకంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ కి, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, నియమాలకు కట్టుబడి పని చేస్తూ, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.

More articles

Latest article