. . . కోనాపూర్ సెక్షన్ పరిధిలో తాండాలలో
. . . పోలిస్, ఆటవి శాఖ సంయుక్తంగా తనిఖీలు
. . . వన్య ప్రాణుల సంచారంపై అవగాహన
కమ్మర్ పల్లి, బతుకమ్మ:
నిజామాబాద్, జగిత్యాల జిల్లా సరిహద్ధులలో పులుల జాడ కనుక్కునేందుకు నిజామాబాద్ డివిజన్ ఆటవి శాఖ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. పులుల సంచారం ను తెలుసుకునేందుకు ఆటవి శాఖ, పోలిస్ శాఖ సంయుక్తంగా సోమవారం కమ్మర్ పల్లి రేంజ్ పరిధిలోని కోనాపుర్ సెక్షన్ లో తనిఖీలు చెపట్టింది.

నిజామాబాద్ డిఎఫ్ఓ అదేశాల మేరకునిజామాబాద్ ,జగిత్యాల జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతున్న పులుల జాడ కనుగొనే మరియు పర్యవేక్షణ కార్యకలాపాలలో భాగంగా, కోనాపూర్ సెక్షన్ పరిధిలోని కేసీ తండా, వాసన్ గుట్ట తండా మరియు చుట్టుపక్కల నివాస ప్రాంతాలలో కమ్మర్‌పల్లి రేంజ్ సిబ్బంది సంబంధిత పోలీస్ శాఖ అధికారులతో కలిసి విస్తృతమైన క్షేత్రస్థాయి తనిఖీలు దాడులు నిర్వహించారు.సంయుక్త బృందాలు చుట్టుపక్కల ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, పులుల సంచారం ఉండవచ్చనే సమాచారంపై స్థానిక గ్రామస్తులతో మాట్లాడారు. ఈ కార్యకలాపాల సందర్భంగా, తనిఖీ చేసిన ప్రదేశాలలో పులుల సంచారాన్ని సూచించే ఎలాంటి ఆధారాలు లేదా తాజా ఆనవాళ్లు కనబడలేదని అధికారులు తెలిపారు.

అటవీ శాఖ సిబ్బంది సమీప గ్రామాలు నివాస ప్రాంతాలలో వన్యప్రాణుల సంచార నియమావళి, తీసుకోవలసిన ముందుజాగ్రత్త చర్యలు, భయాందోళనలకు గురికావడం లేదా ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి వాటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఏవైనా వన్యప్రాణులు కనపడితే వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని, రాత్రి వేళల్లో అటవీ శీవారు ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్లవద్దని గ్రామస్తులకు సూచించారు. ప్రజా భద్రత, వన్యప్రాణుల సంరక్షణ రెండింటినీ నిర్ధారించడంలో అటవీ, పోలీసు శాఖలకు సహకరించాలని కూడా అటవీ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.అటవీ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది స్థానిక అధికారుల సమన్వయంతో అవసరమైన క్షేత్రస్థాయి నిఘా కొనసాగుతోందని తెలిపారు.

