27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కల్లు మత్తు కిక్కు లో ఘర్షణ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కల్లు బట్టి లో ఒకరి దారుణ హత్య

. . . మరోకరు సీరియస్

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

కృత్రిమంగా రసాయనాలతో తయారైనా కల్లు ఇచ్చిన కిక్కు లో కోందరి మధ్య జరిగిన ఘర్షణ ఒకరు హత్యకు గురికాగా మరోకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. చిత్తు కాగితాలు ఏరుకునే జీవనం సాగించే ఐదుగురు మధ్య నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ కల్లు బట్టి లో ఆదివారం రాత్రి ఘర్షణ జరిగింది. అందులో ఇద్దరు మిత్రులు పూలాంగ్ కు చెందిన షాకీర్, ఇంద్రపూర్ కు చెందిన కమ్మరి శివ లపై మరో ముగ్గురు దాడి చేశారు. కల్లు కాంపౌండ్ లో కల్లు సేవించిన తరువాత స్వల్పంగా మాటా మాటా పెరిగిన తరువాత జరిగిన దాడిలో షాకీర్ అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మరో వ్యక్తి శివను 108 అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించగా ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు. ఘర్షణ గల కారణాలు తెలియలేదు. ఇద్దరిపై దాడి చేసిన వారు అక్కడి నుంచి పరారీ అయ్యారు.స్థానిక కల్లు బట్టి మద్యం విక్రయం జరుగుతుంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు పూలాంగ్ కల్లు బట్టి లో జరిగిన ఘర్షణ, మర్డర్ లపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

A clash in a drug-fueled Kikku

డేంజర్ డ్రగ్ తో కల్లు తయారి నా?…..

నిషేదిత మత్తు పదార్థాలను కలిపి తయారు చేసే కృత్రిమ కల్లు మత్తులో ఇందూర్ నగరం జోగుతోంది. కిక్కు కోసం తయారి కల్లులో ఒకప్పుడు క్లోరోపాం, డైజోపాం కలిపేవారనేది జగమెరిగిన సత్యం. నిజామాబాద్ జిల్లాలో, జిల్లా కేంద్రంలో కృత్రిమ కల్లు తయారిలో డేంజర్ డ్రగ్ గా పేరున్న నిషేదిత అల్ర్పాజోలం వాడుతారనేది అందరికి తెలిసిందే. కిలోకు రూ.10 లక్షల విలువైన ఆల్ఫ్రాజోలం నిషేధించింది ప్రభుత్వం. దానికి కోకైన్, హేరాయిన్ జాబితాలో చెర్చి డేంజర్ డ్రగ్ గా నామకరణం చేసింది. కల్లు ముస్తే దారులు, కాంట్రాక్టర్ లు సహజ సిద్ధమైన కల్లు దొరక్క దానికి అలవాటు పడిన వారిని మత్తు కల్లు కు బానిసలు చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కల్లు బట్టిలలో డేంజర్ డ్రగ్ గా పేరుగాంచిన అల్ఫ్రాజోలం తయారి కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. నిత్యం లక్షల లీటర్ల కల్లు డిపో లో తయారు చేసే కల్లులో కిక్కు కోసం నిషేదిత మత్తు పదార్థాలు కలుపుతారనేది అందరికి తెలిసిందే. రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి తర్వాత నిషేదిత మత్తు పదార్థం డేంజర్ డ్రగ్ గా పేరుగాంచిన అల్ర్పాజోలం దోరికేది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. కేసులు గట్రా అయినప్పటికి కల్లు డిపోలో అల్ర్పాజోలం వినియోగం మాత్రం అగడం లేదు. తమవద్ధ అల్ర్పజోలం వినియోగం సంబంధించిన ల్యాబ్ లేదని సాకుతో కల్లు డిపోలలో కల్లును తయారు చేస్తు, కల్లు బట్టిలలో విక్రయాలు జరుగుతున్న పోలీస్, ఎక్సైజ్, నార్కోటిక్ శాఖలు ఎన్నడు పట్టించుకున్నది లేదు అనే ఆరోపణలు ఉన్నాయి.

 

More articles

Latest article