26.8 C
Hyderabad

ఉమ్మడి జిల్లాలో 13 మంది సిఐలు

13 CIs in the undivided district

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 13 మంది సిఐలను బదిలీ చేస్తూ మల్టీజోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ నగర 1వ టౌన్ ఎస్ హెచ్ వోగా పని చేస్తున్న రఘుపతిని హైదరాబాద్ ఐజీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో నిజామాబాద్ నార్త్ రూరల్ సర్కిల్ సిఐ శ్రీనివాస్ ను పోస్టింగ్ ఇచ్చారు. నిజామాబాద్ నగర సర్కిల్ సిఐగా పని చేస్తున్న శ్రీనివాస్ రాజ్ ను సీఎస్ బీకి బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఆర్మూర్ పీఎస్ ఎస్ హెచ్ వో సత్యనారాయణను నియమించారు. సౌత్ రూరల్ సర్కిల్ సిఐ సురేష్ కుమార్ ను పీసీఆర్ కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ధర్పల్లి సర్కిల్ సిఐ బొడ్డు బిక్షపతిని నియమించారు. వీఆర్ లో ఉన్న చింతలతాడెం శ్రీనివాస్ ను నిజామాబాద్ నార్త్ రూరల్ సర్కిల్ సిఐగా నియమించారు. సీఎస్ బీలో ఉన్న కార్నె శ్రీధర్ రెడ్డిని రూరల్ పీఎస్ కు అటాచ్ చేశారు. మహిళా  పీఎస్ సిఐగా ఉన్న శ్రీలతను హైదరాబాద్ ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వోగా ఉన్న పబ్బ ప్రసాద్ ను మహిళా పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. సీఎస్ బీలో ఉన్న గుమ్మడి మల్లేష్ ను ట్రాఫిక్ పీఎస్ ఎస్ హెచ్ వోగా  నియమించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డులో ఓడిపై ఉన్న గుండు శ్రీకాంత్ గౌడ్ ను ఆర్మూర్ పీఎస్ ఎస్ హెచ్ వోగా నియమించారు.

 

 

More articles

Latest article