24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రోజు రోజుకు పెరిగిపోతున్న వీధి కుక్కల బెడద

Must read

📰 Generate e-Paper Clip

 

జుక్కల్, బతుకమ్మ :

 

వీధి కుక్కల బాధలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వీధి కుక్కల నివారణ చర్యల కోసం సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు కుక్కలను చంపకుండా వాటిని ప్రతి జిల్లా కేంద్రంలో కుక్కల జంతుశాలని ఏర్పాటు చేసి వాటిలోకి తరలించాలని తీర్పు వెలువరించగా సుప్రీంకోర్టు ఆదేశాలు అమలయ్యేది ఎప్పుడు అనే చర్చలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. వీధి కుక్కలతో ఏ గ్రామంలో చూసిన ఏ వాడలో చూసిన ప్రజలకు ఇబ్బందికరంగా మారింది పిచ్చి కుక్కలు అప్పుడప్పుడు దాడులు చేస్తూ ప్రజలకు పశువులకు తీవ్ర గాయాల పాలు చేస్తున్నాయి. కుక్కలతో ప్రజలకు హాని కలిగిస్తున్న వాటిని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరిస్తూ ప్రతి జిల్లా కేంద్రంలో కుక్కల జంతు శాల ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం కుక్కల దాడుల నుండి ప్రజలకు కాపాడేందుకు గ్రామాల నుండి కుక్కలను తరలించే చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఎప్పుడు అమలైతాయో కానీ గ్రామాల్లో కుక్కల మందలతో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. కుక్కల దాడులకు ప్రజలు గురికాకముందే ముందు జాగ్రత్తగా గ్రామాల్లోని కుక్కలను తరలించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

More articles

Latest article