. . . వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి హత్య
. . . తన ప్రియురాలితో ఆక్రమ సంబంధం ఉందని కలిసిన మరో యువకుడు
. . . ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
బాన్సువాడ, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలో ఈ నెల 23న జరిగిన కాశీరామ్ అనే యువకుడిని హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసును ఛేదించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ హన్మాజిపేట్ కు చెందిన కాశీరామ్ భార్య సవితకు, వరుసకు మరిది అయిన సంతోష్‌తో వివాహేతర సంబంధం ఉందని తెలిపారు. తమకు అడ్డుగా ఉన్న భర్త కాశీరామ్‌ను చంపాలనే ఉద్దేశంతో సవిత సంతోష్ కలిసి హత్యకు పథకం రచించారు. కాశీరాంకు రాము అనే యువకుడి ప్రియురాలితో వివాహేతర సంబంధం ఉంది. దాంతో ముగ్గురు కలిసి పథకం ప్రకారం ఈ నెల 23వ తేదీన కాశీరామ్‌కు మద్యం తాగించి, అనంతరం తాడుతో ఉరివేసి హత్య చేశారు. ఆ తర్వాత సంతోష్, రాము కలిసి మృతదేహాన్ని హన్మాజీపేట్ చెరువులో పడేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన బాన్సువాడ పోలీసులు నిందితులైన సంతోష్,రాము, సవితలను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును చేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.
