26.8 C
Hyderabad

మున్సిపల్ చైర్ పర్సన్ భర్త పెత్తనం పై బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ల గుస్సా

BRS party councilors angry over municipal chairperson's husband's dominance

Must read

📰 Generate e-Paper Clip

 

   

     . . . కామారెడ్డి బల్దియాలో పొత్తుల పార్టీల మధ్య ముదిరిన వివాదం

 

    . . . చైర్ పర్సన్ భర్తను  మెడపట్టి గేంటివేస్తామని గులాబి కౌన్సిలర్ ల వార్నింగ్

 

  కామారెడ్డి, బతుకమ్మ:

 

కామారెడ్డి బల్దియాలో పొత్తులతో జరుగుతున్న పాలన వ్యవహరంపై విపక్ష సభ్యులు జంగ్ సైరన్ మోగించారు. సుమారు ఏడు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీ లేకపోవడంతో బిఆర్ఎస్ మద్దతుతో కామారెడ్డి మున్సిపాలిటీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కామారెడ్డిలో ఎక్కువ మెజార్టీ స్థానాలు గెలిచినప్పటికీ అధికార పీఠం దక్కించుకునేందుకు అవసరమైన మెజారిటీ బిజేపికి దక్కకపోవడంతో ప్రతిపక్షం గా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. బిఆర్ఎస్, కాంగ్రెస్ లు కలిసి అధికారం చెలయిస్తుండగా పొత్తులతో ఏర్పడిన బల్ధియా పాలన పై  చైర్ పర్సన్ భర్త పేత్తనం పెరగడం పై కౌన్సిల్ లో సభ్యులు కాని వ్యక్తి  అజమాయిషి పై గులాబీ పార్టీ కౌన్సిలర్ లు గరం గరం గా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు బీజేపీ ప్రతిపక్ష పార్టిగా బల్దియాలో జరుగుతున్న అవినీతి ఆక్రమాలతో పాటు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దానికి ఇప్పుడు అధికార పార్టీ మిత్రపక్షంగా ఉన్న గులాబీ పార్టీ సైతం చైర్ పర్సన్ భర్త పెత్తనం పై జంగ్ సైరన్ మోగించింది. గురువారం బల్ధియా కార్యాలయం ఎదుట బిఆర్ఎస్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ లు సమావేశమై కామారెడ్డి మున్సిపాలిటీ చైర్ పర్సన్ పెత్తనం పై కమీషనర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. చైర్ పర్సన్ భర్త గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇకపై చైర్ పర్సన్ భర్త మున్సిపాల్టిలో అడుగు పెడితే మెడపట్టి గేంటివేస్తామని వార్నింగ్ ఇవ్వడం కలకలం రేగింది.

BRS party councilors angry over municipal chairperson's husband's dominance

 అగ్గి రాజేసిన బతుకమ్మ ఉత్సవాల ఎర్పాట్లు…

కామారెడ్డి జిల్లా కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలు ప్రతిఎటా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ సారి బల్ధియా బతుకమ్మ ఉత్సవాలు, నిమజ్జన ఎర్పాట్లపై సమావేశం నిర్వహించకుండా తూతూ మంత్రంగా మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేశారని బిజేపి నిమజ్జనం రోజున పైర్ అయింది. బల్ధియా అధికారుల నిర్లక్ష్యం కారణంగా మహిళలు బతుకమ్మ నిమజ్జనంలో సెల్ ఫోన్ లైట్ల వెలుగులో చేశారని ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయం బిజెపి బిఆర్ఎస్ కౌన్సిలర్ లు తోడయ్యారు. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా వార్డులలో గుంతల పూడ్చివేత కోసం రూ.28 లక్షలు మంజూరు చేసిన  పనులు ఎందుకు చేయలేదు, అ నిధులు ఏమయ్యాయి అని గుస్సా అయ్యారు. వినాయక, దుర్గా మాత విగ్రహల నిమజ్జనం తరువాత చెరువులో మిగిలిన స్క్రాప్ ని అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. బల్దియా ఎన్నికలు జరిగిన తరువాత ఇప్పటి వరకు 49 వార్డులలో 50 వేల పనులు చేపట్టలేదని గరం గరంగా ఉన్నారు కౌన్సిలర్లు. పట్టణంలో సమస్యలు తీవ్రంగా ఉన్న కౌన్సిల్ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని ప్రతిపక్ష, విపక్ష కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు.

 

మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ప్రైవేట్ వసూళ్లపై కార్పొరేటర్ల గరం గరం…

 

కామారెడ్డి బల్దియాలో మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ఆగడాలు మీతి మీరాయని కౌన్సిలర్ లు ఆరోపణలు చేస్తున్నారు. గత  పనులు చేసిన కాంట్రాక్ట్ ల వద్ధ అధిక మొత్తంలో కమీషన్ వసూలు చేశాడని మండిపడుతున్నారు. బల్ధియాలో వసూళ్లకు చైర్ పర్సన్ భర్త ప్రైవేట్ గా గ్రూప్ ఎర్పాటు చేసి కలెక్షన్ చేస్తున్నాడని ఆరోపించారు. ఆక్రమ నిర్మాణ పనులను అడ్డుకున్న ఔట్ సోర్స్ ఉద్యోగులను తోలిగించి తన మనుషులను పెట్టుకున్నారని దానికి బల్ధియా అమోదం తెలుపలేదన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సిసి కేమోరాల యాక్సేస్ చైర్ పర్సన్ వద్ధ కాకుండా ఆమే భర్త వద్ధ ఉండటం ఎమిటని ప్రశ్నిస్తున్నారు. ఆక్రమ నిర్మాణాలపై ప్రతిపక్ష పార్టిలు, విఫక్ష కౌన్సిలర్ అభ్యంతరం  వ్యక్తం చేస్తే  కమిషనర్, టిపిఓలను పనులను అపకుండా బేదిరిస్తున్నారని మండిపడుతున్నారు. రెండు నెలలుగా మున్సిపల్ చైర్ పర్సన్ పనులపై సంతకాలు చేయడం లేదని తెలిపారు. బల్ధియాకు సంబంధం లేని వ్యక్తి మున్సిపాల్టిపై పెత్తనంను సహించేది లేదని, మెడ పట్టి గుంటి వేస్తామని వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది. బల్ధియాలో అధికారం కోసం బిఆర్ఎస్, కాంగ్రెస్ ల పోత్తు పోడిచిన ఎడు నెలలకు విబేదాలు రావడం కలకలం రేపుతోంది. పాలన పగ్గాల కోసం వైరిఫక్షాలైన కాంగ్రెస్ బిఆర్ఎస్ పొత్తు పెట్టుకుని, మున్సిపాల్టి పై చైర్ పర్సన్ భర్త పెత్తనం మిత్ర బేధం కు దారి తీసే అవకాశాలు పెరుగుతున్నాయి. అసలు మెజార్టి లేకున్న పాలన పగ్గాలు చిక్కించుకుని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బిజేపి కౌన్సిలర్ లు కొరకరాని కొయ్య గా ఉన్నారు. బిజెపి , బిఆర్ఎస్ తోడు అయితే మాత్రం బల్దియాలో కాంగ్రెస్ పార్టి అధికారానికి గండిపడే అవకాశాలు ఉన్నాయి.

More articles

Latest article