రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం(ఆర్) గ్రామ శివారులో పేకాట ఆడుతున్న పక్కా సమాచారం మేరకు గురువారం రాత్రి పోలీసులు పేకాట స్థావరం పై మెరుపు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఐదుగురు పేకాటరాయుళ్ల ను పట్టుకుని వారి వద్ద నుంచి 53,500 రూ. నగదు, ఐదు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయుళ్ల పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎల్. రామ్ తెలిపారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
