25.1 C
Hyderabad

బీజేపీలోకి గజవాడ సోదరులు

Gajawada brothers join the BJP

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిక

 

. . .  కండువా వేసి ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరానికి చెందిన గజవాడ సోదరులుగా ప్రసిద్దిగాంచిన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గజవాడ హనుమంతరావు, అతని సోదరుడు మాజీ కార్పొరేటర్ సివిల్ ఇంజనీర్ గజవాడ గణేష్ గుప్తలు బీజేపీలో చేరారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ ధర్మపురి ఆధ్వర్యంలో ఇద్దరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గజవాడ సోదరులను రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాంచందర్ రావు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. వారితో పాటు పలువురు రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులు, ఇంజనీర్లు బీజేపీలో చేరారు. నిజామాబాద్ అర్బన్ లో బీజేపీ బలోపేతానికి పార్టీ ఆదేశానుసారం పని చేస్తానని పార్టీలో చేరిన గజవాడ హనుమంతురావు, గణేష్ గుప్తలు తెలిపారు. గజవాడ హనుమంతురావు ప్రస్తుతం దిశ కమిటీ సభ్యులుగా పని చేస్తున్నారు. గజవాడ గణేష్ గుప్త వైశ్య సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక సేవా రంగాలలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

. . . అర్బన్ ఎమ్మెల్యే గైర్హాజరు

భారతీయ జనతా పార్టీలో నిజామాబాద్ నగరానికి చెందిన వైశ్య సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు చేరిక సమయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు పార్టీలో చేరుతుండగా లోకల్ ఎమ్మెల్యే హాజరుకాకపోవడంలో మతలబు ఏమిటని చర్చ జరుగుతుంది. వైశ్య సామాజిక వర్గంలో ధన్ పాల్, గజవాడ ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయనే విషయం అందరికీ తెల్సిందే. ఇప్పటి వరకు రెండు కుటుంబాలు వేర్వేరు రాజకీయ పార్టీలలో ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం అందరూ బీజేపీలో ఉండడంతో పార్టీ బలోపేతం అవుతుందని చెప్పవచ్చు.

Gajawada brothers join the BJP
 

More articles

Latest article