32.5 C
Hyderabad

పెద్దలను వదిలి పేదలను వేదిస్తేన్నారు

They are leaving the powerful alone and harassing the poor

Must read

📰 Generate e-Paper Clip

 

. . . భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

. . . అర్హులైన పేధలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

. . .  ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

నివసించడానికి 50 గజాల భూమిలో ఇళ్ళు నిర్మించుకున్న పేదలను వేదిస్తున్నా అధికార యంత్రాంగం కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్న, కబ్జాలు చేస్తున్న భూ మాఫియాపై చర్యలు తీసుకోవడం లేదని ఆర్ ఎస్ పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు అన్నారు. సోమవారం రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాందేవ్‌వాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన అనేక మంది ప్రజలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు,రేకుల షెడ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారని తెలిపారు. అలాంటి నిరుపేదలను నోటీసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం మానవత్వానికి విరుద్ధమని అన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ భూమి అయినా,రెవెన్యూ భూమి అయినా ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్న అర్హులైన పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖలతో సమన్వయం చేసి భూపట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా,భారీ ఎత్తున ప్రభుత్వ భూములు, చెరువులు,ఇతర ప్రజా భూములను ఆక్రమించిన భూబకాసురులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడిన వారిని వదిలేసి, కేవలం పేద ప్రజలపైనే చర్యలకు దిగడం వివక్షపూరిత వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూబకాసురులు అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకొని, ఆ భూములను అర్హులైన పేదలకు కేటాయించి డబుల్ బెడ్‌రూమ్ గృహాలు నిర్మించి అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పేద ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఆర్ఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో ప్రజా ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్పీ నాయకులు పిట్ల నరేష్, గోపాల్ సింగ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article