27.4 C
Hyderabad

గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరి అరెస్ట్

Two arrested in ganja smuggling case

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  4.368 కిలోల గంజాయి స్వాధీనం

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

గంజాయి అక్రమ రవాణా  చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ 1వ టౌన్ ఎస్ హెచ్ వో బూక శ్రీనివాస్ తెలిపారు. సోమవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ హెచ్ వో మాట్లాడుతూ ఆదివారం రాత్రి రైల్వేస్టేషన్ వద్ద తనిఖీలు చేపడుతుండగా పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించిన నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తాండకు చెందిన సలావత్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు.అతన్ని వద్ద తనిఖీ చేయగా 4.368 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సలావత్ శ్రీనివాస్ ను విచారించగా ఒడిశాకు చెందిన పరిమల్ హర్దాల్ వద్ద గంజాయి కొనుగోలు చేసి నాందేడ్‌కు చెందిన వాహిద్ ఖాన్ పాషాకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గంజాయి అక్రమ వ్యాపారంలో ఆటోనగర్ కు చెందిన ఇబ్రహీం ఖాన్, కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన నునావత్ మోహన్ ప్రోత్సహించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈ కేసులో ఇబ్రహీం ఖాన్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించడం జరిగిందన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

More articles

Latest article