26.2 C
Hyderabad
Monday, August 3, 2026

డార్క్ రూమ్ టెక్నీషియన్ ఎక్కడ..?

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రైవేట్ ఆస్పత్రులలో కనిపించని పారామెడికల్ సిబ్బంది
  • చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల వెలసిన ప్రైవేటు ఆసుపత్రులలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తో అనుమతి పొందిన ఎక్స్ రే టెక్నీషియన్లు( డార్క్ రూమ్ టెక్నీషియన్లు) కనిపించడం లేదు. నగరంలో సుమారు 4-5 వందల పైగా ప్రైవేట్ ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. ఈ  ఆస్పత్రులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 24 గంటలు వైద్య సేవలు  అందుబాటులో ఉంటాయని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని కాసులు కురిపించి జిల్లా వైద్య శాఖ అధికారుల నుంచి  అనుమతి పొందుతున్నారు. కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ కనీసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా( ఎంసీఐ) అంతేకాకుండా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పారామెడికల్ నుంచి గుర్తింపు పొందిన సర్టిఫికెట్స్ ప్రతి ఎక్స్ రే టెక్నీషియన్ అనుమతి పొందాల్సి ఉంటుంది. కానీ జిల్లా ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులతో పాటు యాజమాన్యాలు ఆ నిబంధనలను తుంగలో తొక్కుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కనీసం అనుభవం లేని అర్హత కలగని వారితో రోగులకు ఎక్స్ రేలు తీయించి ఎలా వచ్చిన చూసేది తామేననే ధీమాతో రోగులకు మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఎక్స్ రే టెక్నీషియన్ గా అభ్యసించి జాతీయ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖతో ప్రతి ఎక్స్ రే టెక్నీషియన్ అనమతి పొందాల్సి ఉంటుంది. కానీ ఎక్స్ రే టెక్నీషియన్ గా అనుమతి పొందిన వారికి అధికంగా జీతం ఇవ్వాల్సి ఉంటుందని ఎక్స్ రే ఎక్స్ రే టెక్నీషియన్ గా అనుభవం లేనప్పటికీ ఎంతో కొంత నెలసరి జీతం అందించి రోగులనుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడమే వస్తువులకు పాల్పడడమే ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు యజమాన్యాలు లక్ష్యంగా ఎంచుకున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఉద్దేశంతో వైద్యునికి నమ్మి ఆసుపత్రికి మెరుగైన వైద్య సేవలు కోసం వెళ్తే అక్కడ మాత్రం పూర్తిగా మోసం జరుగుతుందని రోగి బంధువులు రోగులు భావిస్తున్నారు. ముఖ్యంగా తమ వద్ద డిజిటల్ ఎక్స్ రే టెక్నీషియన్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెబుతూనే కనీసం అవగాహన కలగని వారిపట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సాధించి ప్రైవేట్ ఆస్పత్రుల్లో డూప్లికేట్ ఎక్స్ రే టెక్నీషియన్ గా కొనసాగుతున్న వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని రోగి బంధువులు రోగులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇంతటి  మోసాలకు పాల్పడుతున్న స్వార్థ వైద్యులపాటు యజమానులపై చర్యలు చేపట్టి ప్రైవేట్ ఆస్పత్రి అనుమతి పొందిన వారిని తక్షణమే రద్దుచేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.

 

More articles

Latest article