26.2 C
Hyderabad
Monday, August 3, 2026

42శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకై ఉద్యమించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% బిసి రిజర్వేషన్ల సాధనకై బిసి కులాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర సాధన తరహాలో గ్రామ స్థాయిలో ఉద్యమించాలని బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు) రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నల్లకుంట లోగల బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బిసి కులాల ప్రజలు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో తమ జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించడంతో బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్, టిడిపి, వైసిపి తదితర ఆధిపత్య కులాల యాజమాన్యం లోని అన్ని రాజకీయ పార్టీలు  తాము కూడా బిసి కులాల ప్రజల పోరాటాలకు మద్దతుగా నిలుస్తున్నట్లు రాజకీయ లబ్ధి కోసం ఉద్యమాలను పక్కదారి పట్టించే కుట్రలు చేస్తున్యాయని దండి వెంకట్ ఆరోపించారు. తెలంగాణలో 42% రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పె బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు పార్లమెంట్ సమావేశాల్లో చట్టం చేయాలని ఎందుకు పార్లమెంట్ లో డిమాండ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. బిసి కులాల ప్రజలు తమ తమ కులాల వారిగా తమ జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాజకీయ పోరాటం చేయాలని దండి వెంకట్ పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఔట్ సోర్సింగ్ వ్యవస్థలో విధులు నిర్వహిస్తున్న బహుజన కార్మికులకు కనీస వేతనం 26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిఎల్ పి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నల్లా సూర్యప్రకాష్, బిఎల్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. ‌సిద్ది రాములు, ఉపాధ్యక్షురాలు సబ్బని లత, రాష్ట్ర సహాయ కార్యదర్శి వడ్ల సాయి కృష్ణ, ఎలమినేటి శ్రీశైలం, రాష్ట్ర కోశాధికారి మారోజు సునీల్ కుమార్, నిజామాబాద్, కామారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా, నాగర్ కర్నూల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి అదిలాబాద్ జిల్లాల పార్టీ కన్వీనర్ లు వై.అనిల్ కుమార్, ప్రవీణ్,టి.సంజయ్, దబ్బెట ఆనంద్, ఎన్. ఎల్లయ్య,  బి. జగదీష్, ప్రభు లింగం తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article